BPT: కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎం.వి.రాజుపాలెంకు చెందిన ఐదుగురు నిరుపేద మహిళలకు ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా దుప్పట్లు పంపిణీ చేశారు. దాతల సహకారంతో ప్రతి శుక్రవారం పేదలకు నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ అయూబ్, షేక్ బాషా, షేక్ జిలాని, బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపేద మహిళలకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ చేయూత


