హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ సమస్యపై కాంగ్రెస్ నేత గోపాల్ రెడ్డి స్పందన

RR: బడంగ్‌పేట్ పరిధిలోని లెనిన్ నగర్‌లో డ్రైనేజీ పొంగి తాగునీరు కలుషితమవుతుండటంపై కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో మాట్లాడి తక్షణ మరమ్మతులు చేయించారు. సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.