హైదరాబాద్: 28°C
తెలంగాణ

టేకులపల్లిలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్లపల్లికి చెందిన మధు ఇసుక ట్రాక్టర్‌తో వెళ్తుండగా సంపత్‌నగర్ సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ అతడిపై పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఎస్సై రాజమౌళి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.