హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

RR: నందిగామ గ్రామంలో సర్పంచ్ కొమ్ము కృష్ణ చేతులమీదుగా అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ జీవిత బీమా పత్రాలను కూడా అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.