హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నామినేషన్ వేయకుండా భయపెట్టేందుకే దాడి'

ATP: తాడిపత్రి రూరల్ మండలం సజ్జలదిన్నె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ నేత బోయ రాజు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో ఆయన స్కార్పియో వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నామినేషన్ వేయకుండా భయపెట్టేందుకే దాడి చేశారని అన్నారు.