హైదరాబాద్: 28°C
తెలంగాణ

ల్యాబ్‌లో ప్రింటర్ల కొరత.. రిపోర్టుల కోసం రోగుల అవస్థలు

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం ల్యాబ్‌లో ప్రింటర్ల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ల్యాబ్‌లో వివిధ వైద్య పరీక్షల అనంతరం రిపోర్టులు పొందేందుకు వెళ్తే ప్రింటింగ్ మిషన్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్‌లో రిపోర్టుల స్క్రీన్‌షాట్లు తీసి బయట ప్రింట్ చేయించుకోవాలని చెప్పుతున్నారు.