HYD: నగరంలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులో అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తోంది. రోడ్డు తవ్వి మధ్యలోనే వదిలేయడంతో ఓ వ్యక్తి GHMC అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వీడియో తీస్తుండగానే, అతడి కళ్లముందే ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు తవ్వడానికి అనుమతి ఎవరిచ్చారు, పనిని మధ్యలో ఎందుకు ఆపారు, ఎవరైనా చనిపోతే బాధ్యత ఎవరిదని అతడు అధికారులను నిలదీశాడు. ఇప్పుడు ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.
తెలంగాణ
VIDEO: ఫిర్యాదు కోసం వీడియో తీస్తుండగా ప్రమాదం


