హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణాపై ఎస్సై కఠిన హెచ్చరిక

BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక గోదావరి వంతెన కింద అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఎస్సై మేడ ప్రసాద్ ఆధ్వర్యంలో జేసీబీతో కందకాలు తవ్వించి ఇసుక తరలింపు మార్గాలను మూసివేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మేడ ప్రసాద్ హెచ్చరించారు.