హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు విస్తరణపై కమిషనర్‌కు వినతి

ఖమ్మం 37వ డివిజన్‌లోని పెంటగడ్డ బజార్ రోడ్డును 40 అడుగుల మేర విస్తరించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని బీజేపీ నాయకులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేశారు. ఇళ్లకు నష్టం కలగకుండా, పెండింగ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి, రెండు వైపులా డ్రైనేజీలు నిర్మిస్తూ రోడ్డు అభివృద్ధి చేయాలని కోరారు.