హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశు పెంపకానికి ప్రత్యేక విధానం

HYD: రాష్ట్రంలో పశుసంపద తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యేక పశు పెంపకం విధానం రూపొందించాలని తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ (టీజీఎల్‌డీఏ) నిర్ణయించింది. ఛైర్మన్ డా. చరణ్ కౌశిక్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో కృత్రిమ గర్భధారణ కోసం అదనంగా 20 లక్షల డోసుల కొనుగోలుకు తీర్మానించారు. ఈ క్రమంలో కరీంనగర్, షాద్‌నగర్ వీర్య కేంద్రాలను డిజిటల్ చేయనున్నారు.