హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామసభకు రాని అధికారులు

WGL: నల్లబెల్లి ఇందిరమ్మ కుటుంబ బీమాపై ఉదయం 11 గంటలకు జరగాల్సిన గ్రామసభకు అధికారులు రాకపోవడంతో ప్రజలు వేచి చూడాల్సి వచ్చింది. వేదికపై ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ప్రజలకు రక్షణ కల్పించే కార్యక్రమాన్ని అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని, ఇంతకన్నా నిదర్శనం ఏముందని సీపీఐ మండల కార్యదర్శి పరికి కొర్నెల్ అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.