హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ ఖోఖో పోటీలకు కోరుట్ల విద్యార్థి ఎంపిక

జగిత్యాల: గుజరాత్‌లోని వడోదరాలో ఈ నెల 21 నుంచి 25 వరకు జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో తెలంగాణ తరఫున కోరుట్ల మైనారిటీ గురుకుల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి వంతడుపుల పార్థసారథి ఎంపికయ్యాడు. ఈ మేరకు ప్రిన్సిపల్ కే.లావణ్య, పీఈటీ ఇ.రాజేశ్‌కుమార్ శుక్రవారం అభినందించారు. రాష్ట్రం తరఫున ఎంపిక కావడం గురుకులానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు.