హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద వైద్య విద్యార్థినికి రెడ్‌క్రాస్ రూ.85 వేల సాయం

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన ఆకాంక్ష నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన ఆమెకు గత మూడేళ్లుగా రెడ్‌క్రాస్ సొసైటీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ ఏడాది చదువుల కోసం రూ.85 వేల చెక్కును రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్ కె.ఎస్. రవికుమార్ విద్యార్థిని తల్లిదండ్రులకు అందజేశారు.