హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

RR: కేశంపేట గ్లోబల్ స్కూల్లో పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై పరమేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.