హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్దకల్‌కు 760 కొత్త పింఛన్లు

GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలానికి చెందిన 760 మంది లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు వీరిలో ఉన్నారు. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ వంటి పథకాలను ప్రస్తావిస్తూ, ఇందిరమ్మ కుటుంబ బీమా కింద రూ.5 లక్షల కవరేజీ ఉంటుందని తెలిపారు.