హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూత్ హాస్టల్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలి: కలెక్టర్

హనుమకొండ యూత్ హాస్టల్ ప్రాంగణాన్ని ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రాంగణాన్ని పరిశీలించిన ఆమె, ప్రహరీ నిర్మాణంతో పాటు ప్రత్యేక ఈట్ జోన్ ఏర్పాటు చేసి, సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో GWMC కమిషనర్ వెంకన్న, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.