WGL: ఆటోనగర్ మస్జీద్ నుంచి తుమ్మల కుంటకు వెళ్లే రహదారిపై మురుగు నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మురుగునీటితో ఆటోనగర్ రహదారి దుస్థితి


