హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ బియ్యంలో గోల్‌మాల్

WNP: క్లిస్టగిరిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీస్‌లో సీఎంఆర్ బియ్యం నిల్వల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. కేటాయించిన ధాన్యానికి సరిపడా బియ్యం అప్పగించకపోవడంతో ప్రభుత్వానికి రూ. 7.90 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఫిర్యాదుతో ఎస్ఐ రిషికేశ్ కేసు నమోదు చేశారు. అక్రమాలపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.