హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూభారతి సర్వే ప్రారంభించిన తహశీల్దార్

KMR: నాగిరెడ్డిపేట్ మండలంలోని కన్నారెడ్డి గ్రామంలో భూభారతి పథకంలో భాగంగా భూముల రీ సర్వే పనులను శుక్రవారం తహశీల్దార్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులు, సర్వేయర్లకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ అజయ్, సీనియర్ అసిస్టెంట్ సుభాష్, సర్వేయర్లు, సర్పంచ్ సాయిలు ఉన్నారు.