KMM: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత విస్తరించే దిశగా 41 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులను నియమించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కేటాయించిన వీరు ఏడాది పాటు వివిధ విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందించనున్నారు. అనస్తీషియా, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, చిన్నపిల్లల వైద్యం సహా పలు విభాగాల్లో వీరి సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
తెలంగాణ
ఖమ్మం మెడికల్ కళాశాలకు కొత్త వైద్యులు


