హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోగొట్టుకున్న బంగారు గొలుసు అప్పగింత

HNK: కాజీపేట మండలం మడికొండ పరిధిలో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు గొలుసును పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. గొలుసు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చైన్ స్నాచింగ్‌గా భావించి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కిషన్ సిబ్బంది గాలింపు చేపట్టగా, ఇంటి పనిమనిషి గొలుసును గుర్తించి పోలీసులకు అందజేసింది. దీంతో గొలుసును కుటుంబ సభ్యులకు అప్పగించారు.