హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోటి పుష్పార్చనలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న కార్తీకోత్సవాల్లో భాగంగా కోటి పుష్పార్చన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక అని, స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.