హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రి సమాధి వద్ద సుగవాసి ప్రసాద్ బాబు ప్రత్యేక పూజలు

అన్నమయ్య: జడ్పీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఉదయం తన తండ్రి, మాజీ ఎంపీ కీర్తిశేషులు సుగవాసి పాలకొండరాయుడు సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. తండ్రి ఆశీస్సులు తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతానని ఈ సందర్భంగా తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వస్తానని పేర్కొన్నారు.