హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతూరులో అక్రమ మూగజీవాల తరలింపు

పోలవరం జిల్లా చింతూరు మండలంలో మూగజీవాల అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. రాత్రివేళ చీకటిని ఆసరాగా చేసుకుని వాహనాల్లో పశువులను కుక్కి తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తపల్లి, వేములరాయి, నేలకోట ప్రాంతాలకు చెందిన కొందరు ఈ అక్రమ దందాకు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.