హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళోజీ కళాక్షేత్రానికి కుడా కార్యాలయం..!

వరంగల్ జిల్లాలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) కార్యాలయం పాత భవనానికి తాళం పడింది. అధికారులు కార్యాలయాన్ని కాళోజీ కళాక్షేత్రానికి మార్చడంతో పాత భవనం ఖాళీ అయింది. ఈ భవనాన్ని తదుపరి ఏ అవసరాలకు వినియోగిస్తారనే దానిపై నగరంలో చర్చ మొదలైంది. ప్రభుత్వ శాఖకు కేటాయిస్తారా? లేక ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. అధికారులు ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.