హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల బరిలో తల్లీకొడుకు..!

WG: తణుకు మున్సిపల్ ఎన్నికల్లో తల్లీకొడుకు వేర్వేరు వార్డుల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. పట్టణానికి చెందిన మాజీ వార్డు కౌన్సిలర్ తమరాపు రమణమ్మ 40వ వార్డు నుంచి బరిలో నిలిచారు. ఆమె కుమారుడు తమరాపు వాసు ప్రవీణ్ 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ ఒకే పార్టీ తరఫున వేర్వేరు వార్డుల్లో బరిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.