హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ర్యాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు కత్తులతో దాడి!

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని మందలించినందుకు కక్ష పెంచుకున్న ముగ్గురు వ్యక్తులు అన్నదమ్ములపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తమ్ముడికి కత్తిపోట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.