E.G: గోదావరి పుష్కరాలు-2027 తేదీలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిందని, ప్రత్యేకంగా ముహూర్తం అంటూ ఏదీ లేదని దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తెలిపారు. రజమండ్రిలో పండితులతో గురువారం ఆయన సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పుష్కర తేదీలు ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. మొదటి రోజు సూర్యోదయం నుంచి ఏ ఘడియలోనైనా, ఏ ఘాట్ అయినా పుణ్యస్నానం చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు


