హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ఎఫెక్ట్.. జిల్లాలో భారీ వర్షాలు

SKLM: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో జోరుగా వర్షం పడుతోంది. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 55.9 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకి రావొద్దని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.