హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి: పుట్ట మధూకర్

PDPL: కేసీఆర్ పోరాట స్ఫూర్తిని చాటుకోవాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంథనిలోని బీఎస్ బంకెట్ హాల్‌లో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో జరిగే భారీ సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.