PDPL: రామగుండం పరిధిలోని ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ పరిశ్రమల పరిసరాల్లో డ్రోన్ కెమెరాల వినియోగంపై పోలీసులు నిషేధం విధించారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు కలిగి ఉన్న ఎనిమిది మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు. పారిశ్రామిక భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం


