హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

TPT: సూళ్లూరుపేటలోని కోటపోలూరు రోడ్డు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. మన్నారుపోలూరుకు చెందిన పి.మునిరాజా(34) తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. నాయుడుపేట వైపు నుంచి వేగంగా వచ్చిన ఆటో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలై మునిరాజా అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.