KRNL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఇటీవల నెల్లూరులో నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో కర్నూలు క్రీడాకారులు ప్రతిభ చాటారు. రామ్ జిగ్నేష్ ప్రథమ స్థానం, పల్లె అభిషయ్ తృతీయ స్థానం సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ తెలిపారు. వీరిద్దరూ నవంబర్ 23 నుంచి 27 వరకు గోవాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ రైఫిల్ షూటింగ్ పోటీలకు కర్నూలు క్రీడాకారులు


