NTR: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తిరువూరులో పూర్తిగా ఏసీ సౌకర్యంతో కొత్త శాఖను గురువారం ప్రారంభించింది. విజయవాడ రీజియన్లో ఇది 50వ శాఖ. ఆర్డీవో ఎ. కుమార్ ప్రారంభోత్సవం చేయగా, రీజియన్ జనరల్ మేనేజర్ విజయ ఎన్. పాల్గొన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలు చేరువవుతాయని ఆర్డీవో అన్నారు. 444 రోజుల డిపాజిట్ పథకంలో సాధారణ ప్రజలకు 6.75 శాతం వడ్డీ లభిస్తుందని జీఎం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ


