హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి తిరుమంగళ ఆళ్వార్ ఉత్సవాలు

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 20 నుంచి 24 వరకు తిరుమంగళ ఆళ్వార్ తిరు నక్షత్ర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఆలయ ప్రాకార ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.