హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో రెండో రోజు 48 నామినేషన్లు

ప్రకాశం: గిద్దలూరు మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజు ప్రశాంతంగా ముగిసింది. గురువారం రెండో రోజు 48 సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వార్డు సభ్యుల స్థానాలకు 195 నామినేషన్లు నమోదయ్యాయి. నామినేషన్ల కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి మద్దతుదారులతో సందడి నెలకొంది.