హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పం మహిళకు కీలక పదవి

చిత్తూరు జడ్పీ వైస్ చైర్‌పర్సన్‌గా గుడుపల్లి జడ్పీటీసీ ఎస్.మంజుల ప్రియ ఖరారయ్యారు. 11,094 ఓట్ల మెజారిటీతో ఆమె జడ్పీటీసీగా గెలిచారు. కుప్పం నియోజకవర్గం శెట్టిపల్లి ఆమె స్వగ్రామం. ఇవాళ చిత్తూరులో జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత వైస్ చైర్‌పర్సన్‌గా ఆమెను ఎన్నుకుంటారు. చిత్తూరు ZP ఛైర్పర్సన్ శైలజను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.