హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలి బడుల్లో డీఈవో తనిఖీ

VZM: బొబ్బిలిలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలను గురువారం డీఈవో మాణిక్యంనాయుడు అకస్మాత్తుగా తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేసి, పిల్లలు ఎందుకు వెనకబడ్డారో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలన్నారు. పదో తరగతికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు పెట్టాలని, 15 రోజుల తర్వాత సమీక్షిస్తానని, మెరుగుపడకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.