MLG: వాజేడు మండలం పూసూరు సమీపంలోని చెక్‌పోస్టు వద్ద నీటిగుంతలో మొసలి పిల్లలు కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలో నీరు చేరగా, అందులో మొసలి పిల్లలను ప్రత్యక్షసాక్షులు గుర్తించారు. గోదావరి నదికి సుమారు అర కిలోమీటరు దూరంలోనే ఈ గుంత ఉండటంతో మొసలి పిల్లలు అక్కడికి ఎలా వచ్చాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
నీటిగుంతలో మొసలి పిల్లల కలకలం


