VSP: ఆనందపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.శ్రీ వాణి తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీఏ వంటి కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలకు హాజరై ప్రవేశాలు పొందాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక అడ్మిషన్లు'


