హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పాకపాడు వద్ద డంపింగ్ యార్డుతో ఇబ్బందులు

ELR: బొమ్మిడి రహదారిలోని ఉప్పాకపాడు వద్ద చెత్త సమస్యతో గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పక్కనే చెత్త చెదారం పేరుకు పోవడంతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. దీంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు  వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.