హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

KRNL: ఆదోని పట్టణంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ దృష్టి సారించారు. ఇవాళ ఉదయం పట్టణంలోని పలు ప్రాంతాల్లో  ఆయన పర్యటించి పారిశుద్ధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణ ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా, పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు.