కృష్ణా: 1977 NOV 19న సంభవించిన దివిసీమ ఉప్పెన ఓ తీరని విషాదం. బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుపాను కృష్ణా జిల్లా తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో వీచిన గాలులు, సముద్రపు భారీ అలలు అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక ప్రాంతాలను ముంచెత్తాయి. సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహావిపత్తు ప్రకృతి వైపరీత్యాలపై అప్రమత్తత ఎంత అవసరమో గుర్తుచేస్తుంది.
ఆంధ్రప్రదేశ్
దివిసీమ ఉప్పెన.. 49 ఏళ్లు పూర్తి!


