హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోవూరు హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

NLR: కోవూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయాన్నే రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. మోటార్ బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న ఇనుప దిమ్మెను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడకక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలియజేశారు. చనిపోయిన వ్యక్తులు విడవలూరు మండలానికి చెందిన వారిని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.