హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈపూరు పంచాయతీ బరిలో తోడికోడళ్ల పోరు

PLD: ఈపూరు పంచాయతీ సర్పంచ్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ స్థానంలో తోడికోడళ్లు పోటీ పడుతుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. కూటమి మద్దతుతో జగం శ్రీలక్ష్మి, వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా జగం తిరుపతమ్మ బరిలో నిలిచారు. దగ్గరి బంధువులు కావడం, బీసీ ఓట్లు అధికంగా ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. నామినేషన్ రోజున ఇద్దరూ భారీ ర్యాలీలు నిర్వహించి బలప్రదర్శన చేశారు.