హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతి సున్నిత గ్రామాల్లో పోలీసు నిఘా

GNTR: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా గుంటూరు జిల్లాలో అతి సున్నిత గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అక్రమ మద్యం నిల్వలు, నగదు పంపిణీపై విస్తృత తనిఖీలు సాగుతున్నాయి. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించినా, నామినేషన్లకు అడ్డు తగిలినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.