హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DSC 2026 అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ

ASR: డీఎస్సీ 2026 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందించనున్నారు. టెట్ ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉన్నవారు అర్హులు. ఈనెల 25లోగా విశాఖపట్నంలోని బీసీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ ఉపసంచాలకురాలు కె.రాజేశ్వరి తెలిపారు.