హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ZP వైస్ ఛైర్మన్‌గా శిరగాని నాగేశ్వరరావు

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా అత్తిలి జడ్పీటీసీ సభ్యుడు శిరగాని నాగేశ్వరరావు (నాగు) పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన నాగు ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో 14,231 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పటికే జడ్పీ ఛైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు పేరును పార్టీ ఖరారు చేసింది.