హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జేఎన్టీయూకే తైక్వాండో టోర్నమెంట్ ప్రారంభం!

BPT: వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూకే ఇంటర్ కాలేజ్ తైక్వాండో పోటీలు, యూనివర్సిటీ జట్టు ఎంపికలు ప్రారంభమయ్యాయి. సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డా. జగదీష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఖాదిర్ బాషా హాజరయ్యారు. 30 కళాశాలల నుంచి 80మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పీడీ తెలిపారు.