హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ చైర్మన్ ఎన్నికపై కలెక్టర్ కీలక ఆదేశాలు

NDL: జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె.. సమావేశ ఏర్పాట్లు, సభ్యులకు కల్పించాల్సిన వసతులు, ఇతర సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.